అంశం:చిరు వ్యధలు
శీర్శిక: *సీత బాధలు సీతవి*
*సీత బాధలు సీతకుంటాయి*
*పీత బాధలు పీత కుంటాయి*
కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు
జీవ కోటి ఆన్నింటికి ఉంటాయి
ఏ ఒక్క ప్రాణి అతీతం కాదు
ఏ ఒక్క చెట్టు పుట్టా అతీతం కాదు!
అందరనుకుంటారు
పుడమి చాలా విశాలమైనది
దానికి ఏ బాధలు ఉండవని
భూమికి బాధలు దుఃఖాలు ఉంటాయి
ఎండలు కొట్టి నపుడు మండి పోతుంది
వర్షాలు పడినప్పుడు అవని
చిత్తడి చిత్తడి అవుతుంది!
తుఫానులు సైక్లోన్ లు వచ్చినపుడు
భూమిని నిలువునా కోసి పడేస్తుంది
యుద్ధాలు జరిగినపుడు తూట్లుపడి
పుడమి ఎంత తల్లడిల్లుతుందో!
భూకంపాలు వచ్చినపుడు
పుడమిలో పగుళ్ళు ఏర్పడుతాయి
ఖనిజాల కొరకు కౄడాయిల్ కొరకు
పృధ్వివి ని కుల్లు కుల్లు పొడుస్తారు
ఉప్పు కారం తినని, ఆశలు కోరికలు లేనట్టి
ప్రాణం లేని ధరణికే అన్ని బాధలు ఉంటే!
ఇక ఉప్పు కారం తినే మనుష్యులకు
మనసు హృదయం గుండె ఉన్న
మనుషులకు చిన్న చిన్న బాధలు
చిన్న చిన్న కష్టాలు చిరు వ్యధలు
ఉండటంలో సందేహమేముంది!
జీవితంలో చిన్న చిన్న వ్యధలు
ప్రతి ఒక్కరికీ ఉంటాయి
తల్లిదండ్రుల వలననో పిల్లల వలననో
బంధుమిత్రులు, భార్యాభర్తల వలననో
అనారోగ్యాలు ఆర్ధిక పరిస్థితుల వలననో
నిశి తరువాత జాబిలి సహజం
పరిస్థితులకనుగుణంగా కాలక్రమేనా
వాటిని చక్కగా అధిగమిస్తూ
జీవన యానం సాగించడమే
ఉత్తముల లక్షణం!
No comments:
Post a Comment