అంశం: ఊహలు
శీర్షిక: *ప్రయాగ కుంభమేళ*
ఆదొక పవిత్రమైన స్థలం
అందమైన సుందర ప్రదేశం
అదొక పండుగ వాతావరణం
ఇసుకేస్తే రాలని కిక్కిరిసిన భక్త జనం
ఆదిత్య నాధ్ యోగికి పరీక్షా సమయం
అమృత కలశం విష్ణువు తీసికెళ్తుంటే
జారిన నాలుగు అమృతం చుక్కలలో
ఒకటి పడిందని, పుణ్యక్షేత్రంగా మారిందని
పురాణాలు ఇతిహాసాలు విశదపరిచే
అదే ఉత్తర ప్రదేశ్ లోని *ప్రయాగ కుంభమేళ*
అతి పెద్ద *పవిత్ర పుణ్యక్షేత్రం*
మూడు నదులు గంగా యమునా సరస్వతి
కలిసిన త్రివేణి సంగమం , మోక్షా క్షేత్రం
మునులు స్వాములు అఘోరాలు
అధిక సంఖ్యలో చేరు ఏకైక యాత్రా స్థలం
మూడు పుణ్య నదులు కలుస్తూ పారుతున్న
సరస్వతీ నదిలో కుటుంబ సభ్యలతో కలిసి
స్నాన మాచరించాలనీ ,
అక్కడి పరమేశ్వరాధి దేవుళ్ళను దేవతలను
దర్శించుకోవాలనేది నా మనసులోని ఊహ
ఇది ఊహానే అవుతుందో నిజమవుతుందో
కాలమే నిర్ణయించాలి
కాలానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని
నమ్మేవారిలో నేను ఒకరిని
No comments:
Post a Comment