అంశం: మధుర భావాల సవ్వడి
శీర్షిక: *నా కలల రాణి*
వృక్షాలను చీల్చుకుంటూ.సూర్య కిరణాలు
మంచు పరదాలను తోసుకుని వస్తుంటే
చల్లని పిల్లగాలి, పిట్ట గోడపై కూర్చున్న
ఆమనికి తగులుతుంటే...
ఆహా...కారుమబ్బుల వంటి ఆమె
నల్లని కురులు రెపరప లాడుతుంటే!
మేలి బంగారు వన్నె మేను, చందమామను
మించిన చల్లని ఎర్ర మందార మోము
హంస రెక్కల లాంటి కనుల రెప్పలు
తేనే వన్నె లాంటి మెరిసే కనులు
చురకత్తుల్లాంటి కీగంటి చూపులు
మయూరంలో వంపులు తిరిగే నడుము
మడిచిన మోకాలిపై సేద తీరిన కరాలు!
లేత ఎరుపు రంగు పెదవుల మధ్యలోని
ముత్యాల పళ్ళు తెరుచుకుని వస్తున్న
భావాల సవ్వడి మధురాతి మధురం
మనసు ఉప్పొంగిపోయే నిండు గోదావరిలా!
తరువు చిటారు కొమ్మన చిలుకా గోరింకలు
చూడ ముచ్చటగా గుసగుసలాడుతుంటే
మనసులోని మధుర భావాలు, ఎన్నెన్నో
ఆమని వైపు సైగలు చేస్తున్ననూ
కాళ్ళు కదలకుండే, ప్రయత్నాలు విఫలమాయే!
సమయం గడుస్తుండే, సంధ్యా వేళా రానే వచ్చే
రెప్ప వాల్చకుండా, ఆమని వైపే చూసినా
పిట్ట గోడపై *నా కలల రాణి* అదృశ్యమాయే
మెల్లె మెల్లగా తెలిసి వచ్చింది
ఇది అంతా ఒక కలే ననీ
బాధతో నిట్టూర్చాను...
ఇది కల గాకుటే బాగుండుననీ
తలుచుకుంటూ!
No comments:
Post a Comment