Tuesday, March 4, 2025

కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటేగా

అంశం : విధి


శీర్షిక : కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటేగా 

తలుపులు బిగించుకుని వెచ్చగా
ఆనందపు జీవనం కొందరిది
విధి చేతిలో వంచితులై
నిలువ నీడ లేక చలికి వణికే
శాపగ్రస్తుల జీవనం మరికొందరిది...!

ఇదేమి కృతయుగం, త్రేతాయుగం
ద్వాపరయుగం కాదు
ఆశ్చర్యం చెందడానికి, బాధ పడడానికి
ఇది కలియుగం కలికాలం..!

మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడినట్లు
జనాభా పెరిగే సరికి ఉమ్మడి కుటుంబాలు
మాయమై న్యూక్లియర్ కుటుంబాలు
ఆవిర్భవిస్తున్నాయి
పెద్దలపై గౌరవం తగ్గిపోతుంది
సంపద పెరగడం వలన అహం పెరుగి
దయ కరుణ అనురాగాలు కనుమరుగైనాయి..!

సంకుచిత బుద్ధి పెరిగి పోవడం వలన
జనులు తలుపులు బిగించు కొని
హాయిగా జీవిస్తున్నామనుకుంటున్నారు
నేడు విధి చేతిలో పెద్దలు , వృద్దులు 
విలవిల లాడిపోతున్నారు
కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటేగా 
అనుభవిస్తారు రేపు వారు కూడా!

No comments: