Tuesday, March 4, 2025

ఎదురు చూపుల తీయదనం

అంశం: ఎదురు చూపుల తీయదనం


శీర్షిక: *కనువిందు చేసే కనురెప్పలు*

అంద చందాలు వొలుక బోస్తుంటే ఆనందాలు
వెల్లివిరుస్తుంటే చూపుల చదరంగంలో మనసులు
పులకించి పోగా మాపుల మృదంగం వాయిస్తూ
మల్లె పందిరి నీడలోన జాబిలి పూయంగ!

తుమ్మెదలు ఝంకారావం చేస్తుండ మనసు పులకరించ వయసు పొంగి పోయే
కనువిందు చేసే కనురెప్పలు
నలువైపులా వెళ్ళాల్సిన చదరంగ చూపులు
ఏకాగ్రతతో తదేకంగా చూస్తుండే!

కనురెప్పలు వాల్చకుండా చూసినా
తనివి తీరకుండే మనసు మారకుండే
వయసు ఆగకుండే గడియ కుదరదాయే
రక్తనాళాల్లో వేగం పెరిగి కుతకుత లాడే రుధిరం!

కలిసిన చూపులు మిరుమిట్లు గొలిపే
మనసు కుదుటపడే సంగీత మృదంగ
తరంగాలు కలిసి లాలించి ఒప్పించే
రెండు హృదయాలు స్పందించే !

తనివి తీరగ మనసు కుదుటపడే
శరీరం చల్లబడగ ఆ చూపుల ఆనందం
మాపంతా మాయజేసే స్వర్గం చేరువాయే
తీయని చూపుల విలువ ఏమిటో
ఈ నాడే తెలిసి వచ్చే !

No comments: